Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎడ్లకు ప్రత్యేక పూజలు.. కంగ్టిలో ఘనంగా పోలా వేడుకలు మనుషుల్లాగే ఒరంగుటాన్‌ పిల్లల అల్లరి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 10, 2026 07:40 PM

ప్రయాణించే తల్లులకు ఊరట.. మదర్ ఫీడింగ్ రూమ్ ప్రారంభం

10-09-2026 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రయాణించే తల్లులు తమ చిన్నారులకు ప్రశాంతమైన, సురక్షితమైన వాతావరణంలో తల్లిపాలు అందించేందుకు సంగారెడ్డి న్యూ బస్టాండ్‌లో మదర్ ఫీడింగ్ రూమ్‌ను గురువారం ప్రారంభించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో ‘బేటీ బచావో–బేటీ పడావో’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ గదిని సంగారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ వనిత సంతోష్, జిల్లా సంక్షేమ అధికారి కె. లలిత కుమారి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రయాణ సమయంలో తల్లులు తమ శిశువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తల్లిపాలు అందించేందుకు ఈ సౌకర్యం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన పెంచడంతో పాటు, మహిళలు, చిన్నారుల సంక్షేమానికి ఇటువంటి సౌకర్యాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ సుధాకర్ రావు, సీడీపీఓ చంద్రకళ, మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త గడ్డం పల్లవి, తహసీల్దార్ జయరాం, పీఓ లింగం, అంగన్వాడీ సూపర్వైజర్లు, సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రయాణించే తల్లులకు ఊరట.. మదర్ ఫీడింగ్ రూమ్ ప్రారంభం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News