Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల సృజనాత్మకత.. ఆకట్టుకున్న గణపతి రూపం 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 11, 2026 08:43 PM

వినాయక ఉత్సవాలపై సబ్‌ కలెక్టర్ ఉమా హారతి సమీక్ష

10-09-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని నారాయణఖేడ్ సబ్‌ కలెక్టర్ ఎన్. ఉమా హారతి సూచించారు. గురువారం నారాయణఖేడ్ సబ్‌ కలెక్టర్ కార్యాలయంలో ఆమె ఆధ్వర్యంలో పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్, అగ్నిమాపక శాఖలతో పాటు ఇతర శాఖల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక విగ్రహాల ఏర్పాటు, భక్తులకు అవసరమైన సౌకర్యాలు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్‌ సరఫరా, అగ్నిప్రమాదాల నివారణ, నిమజ్జన కార్యక్రమం వంటి అంశాలపై అధికారులు చర్చించారు. పండుగ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సజావుగా నిర్వహించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సబ్‌ కలెక్టర్ అధికారులకు సూచించారు. సమావేశంలో డీఎస్పీ వెంకటరెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు ప్రతిభ శేఖర్, లక్ష్మీ దీపికతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

వినాయక ఉత్సవాలపై సబ్‌ కలెక్టర్ ఉమా హారతి సమీక్ష

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News