జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రం లో నిర్వహించిన సౌత్ ఇండియా సైన్స్ డ్రామా కాంపిటీషన్ పోటీలలో మండల కేంద్రంలోని క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు జిల్లా ప్రథమ స్థానం సాధించి, రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల కరెస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డి తెలిపారు. పర్యావరణ పరిరక్షణ లో భాగంగా జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాయగిరి ఉన్నత పాఠశాలలో శుక్రవారం సైన్స్ డ్రామా కాంపిటీషన్ పోటీలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం పర్యావరణం అసమతుల్యత వల్ల మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలు, సముద్రాల కాలుష్యం వల్ల ప్రపంచ దేశాలకు ఎదురవుతున్న నష్టాలపై కనిపిప్పు కలిగించే విధంగా " సేవ్ ఓషియన్ సేవ్ ఫ్యూచర్ జనరేషన్" థీమ్ తో విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ డ్రామా పలువురిని విశేషంగా ఆకట్టుకుంది. జిల్లా స్థాయి లో ప్రథమ స్థానం సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులను, వారికి ప్రోత్సాహం అందించిన గైడ్ టీచర్ మురళి, సహకారం అందించిన ఉపాద్యాయులు పునందాస్, అలీం, కల్పన తదితరులను కరెస్పాండెంట్ తో పాటు, ప్రిన్సిపాల్ బి.సురేష్, అకాడమిక్ డైరెక్టర్ జె.మణి, ఇతర సిబ్బంది అభినందించారు.
సైన్స్ డ్రామా పోటీలో జిల్లా ప్రథమ సాధించిన క్రిష్ణవేణి విద్యార్థులు

Editor Desk

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి