Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తీన్మార్ మల్లన్నపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి మనుషుల్లాగే ఒరంగుటాన్‌ పిల్లల అల్లరి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 10, 2026 10:12 PM

చౌటుప్పల్‌లో ‘మారెమ్మ’ సందడి

చౌటుప్పల్‌లో ‘మారెమ్మ’ సందడి

చౌటుప్పల్‌లో ‘మారెమ్మ’ సందడి
10-09-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

థియేటర్‌లో ప్రేక్షకుల స్పందన తెలుసుకున్న చిత్ర బృందం

తెలంగాణ పల్లె సంస్కృతి, సంప్రదాయాలు, గ్రామీణ జీవన విధానాన్ని ప్రతిబింబించేలా తెరకెక్కిన ‘మారెమ్మ’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. చౌటుప్పల్ పట్టణంలో ఈ సినిమా సందడి నెలకొంది. సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్‌ను చిత్ర బృందం సందర్శించి ప్రేక్షకుల అభిప్రాయాలను నేరుగా తెలుసుకుంది. ​హీరోయిన్ దీప బాలు, నిర్మాతలు బండారు మయూర్ రెడ్డి, సుభాష్ రెడ్డి, కుషన్ రెడ్డి, సందీప్ రెడ్డిలతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు చౌటుప్పల్‌లోని థియేటర్‌కు వచ్చి ప్రేక్షకులతో ముచ్చటించారు. కథనం, పాత్రలు, నటీనటుల ప్రదర్శనపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రేక్షకులు స్పందిస్తూ.. గ్రామీణ నేపథ్యం, పల్లె ప్రజల జీవన విధానం, వారి నమ్మకాలు, ఆచార వ్యవహారాలను భావోద్వేగంగా, సహజంగా చూపించిన తీరు తమను ఎంతగానో ఆకట్టుకుందని ప్రశంసించారు.అనంతరం నిర్మాత బండారు మయూర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ పల్లె సంస్కృతిని, గ్రామీణ జీవితంలోని భావోద్వేగాలను ప్రేక్షకులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ తమకు మరింత ఉత్సాహాన్ని ఇస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. థియేటర్‌లో చిత్ర యూనిట్ సభ్యులు నేరుగా తమను కలవడం పట్ల అభిమానులు, ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేశారు.

Sthanikam

చౌటుప్పల్‌లో ‘మారెమ్మ’ సందడి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News