వానాకాలం సీజన్‌లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని సజావుగా కొనుగోలు చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ సంగీతతో కలిసి సంబంధిత శాఖల అధికారులు, రవాణా కాంట్రాక్టర్లతో ధాన్యం సేకరణపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో సుమారు రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు, ఇందుకు అనుగుణంగా 227 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. రైతుల పంట చేతికందే సమయానికి కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, సన్న, దొడ్డు రకం ధాన్యానికి అవసరమైన విధంగా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు.ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలపై రైతులకు అవగాహన కల్పించి, పూర్తి మద్దతు ధర అందేలా చూడాలన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో తేమ కొలిచే యంత్రాలు, తూకం యంత్రాలు, గన్నీ బ్యాగులు, ఇతర మౌలిక సదుపాయాలను ముందుగానే సిద్ధం చేయాలని ఆదేశించారు.తూకం, తరుగు విషయంలో రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ధాన్యం రవాణాకు తగినన్ని వాహనాలు, నిల్వ కోసం అవసరమైన గోడౌన్లను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. ధాన్యం సేకరణ పూర్తయ్యే వరకు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో డీఎస్‌ఓ బాలసరోజ, సివిల్ సప్లయిస్ డీఎం జయశ్రీ, డీసీఓ కిరణ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్‌తో పాటు మార్కెటింగ్, రవాణా, డీఆర్‌డీఓ, వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు, రవాణా కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
227 కొనుగోలు కేంద్రాలతో ధాన్యం సేకరణకు సిద్ధం: జిల్లా కలెక్టర్

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి