నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల కేంద్రంలో గురువారం ఎడ్ల పోలా పండుగను గ్రామస్తులు ఘనంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు తమ ఎడ్లను రంగురంగుల అలంకరణలు, పూలమాలలతో అందంగా ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎడ్లతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించడంతో పండుగ వాతావరణం నెలకొంది. వ్యవసాయంలో తమకు తోడుగా నిలిచే పశువుల పట్ల కృతజ్ఞతను చాటుకునే ఈ పండుగను ప్రతి సంవత్సరం ఆనందోత్సాహాలతో నిర్వహిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. వేడుకల్లో రైతులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు.
PRINT TIME: September 10, 2026 08:44 PM
ఎడ్లకు ప్రత్యేక పూజలు.. కంగ్టిలో ఘనంగా పోలా వేడుకలు

10-09-2026
43 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల కేంద్రంలో గురువారం ఎడ్ల పోలా పండుగను గ్రామస్తులు ఘనంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు తమ ఎడ్లను రంగురంగుల అలంకరణలు, పూలమాలలతో అందంగా ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎడ్లతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించడంతో పండుగ వాతావరణం నెలకొంది. వ్యవసాయంలో తమకు తోడుగా నిలిచే పశువుల పట్ల కృతజ్ఞతను చాటుకునే ఈ పండుగను ప్రతి సంవత్సరం ఆనందోత్సాహాలతో నిర్వహిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. వేడుకల్లో రైతులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి