కంగ్టి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో గణేష్ ఉత్సవాల సందర్భంగా మండపాల నిర్వాహకులకు కంగ్టి ఎస్సై దుర్గా రెడ్డి పలు సూచనలు చేశారు. గణేష్ మండపాల ఏర్పాటులో విద్యుత్ తీగల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, మండపాలు, అలంకరణ సామగ్రి విద్యుత్ తీగలకు తగలకుండా ముందుగానే పరిశీలించుకోవాలని సూచించారు. రాత్రి వేళల్లో మండపాల వద్ద నిర్వాహకులు అప్రమత్తంగా ఉండడంతో పాటు భద్రత కోసం ఒకరు లేదా ఇద్దరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇసుక బస్తాలు, నీటి బాటిళ్లు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ లేదా ఇతర ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. భక్తిశ్రద్ధలతో పాటు భద్రతా ప్రమాణాలను పాటిస్తూ గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని కంగ్టి ఎస్సై దుర్గా రెడ్డి కోరారు.
భక్తితో పాటు భద్రత తప్పనిసరి.. గణేష్ మండపాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై

Krishna
కంగ్టి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో గణేష్ ఉత్సవాల సందర్భంగా మండపాల నిర్వాహకులకు కంగ్టి ఎస్సై దుర్గా రెడ్డి పలు సూచనలు చేశారు. గణేష్ మండపాల ఏర్పాటులో విద్యుత్ తీగల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, మండపాలు, అలంకరణ సామగ్రి విద్యుత్ తీగలకు తగలకుండా ముందుగానే పరిశీలించుకోవాలని సూచించారు. రాత్రి వేళల్లో మండపాల వద్ద నిర్వాహకులు అప్రమత్తంగా ఉండడంతో పాటు భద్రత కోసం ఒకరు లేదా ఇద్దరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇసుక బస్తాలు, నీటి బాటిళ్లు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ లేదా ఇతర ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. భక్తిశ్రద్ధలతో పాటు భద్రతా ప్రమాణాలను పాటిస్తూ గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని కంగ్టి ఎస్సై దుర్గా రెడ్డి కోరారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి