Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భక్తితో పాటు భద్రత తప్పనిసరి.. గణేష్ మండపాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 11, 2026 01:42 PM

సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలి

11-09-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపల్‌ కమిషనర్‌కు బీజేపీ వినతి.

చిట్యాల: సెప్టెంబర్‌ 17ను అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని కోరుతూ బీజేపీ చిట్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కమిషనర్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. పట్టణ శాఖ అధ్యక్షుడు గుండాల నరేష్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో నాయకులు కమిషనర్‌ను కలిసి తెలంగాణ విమోచన చరిత్రను భావితరాలకు అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు.1948 సెప్టెంబర్‌ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. నిజాం పాలన, రజాకార్ల దురాగతాలు, జమీందారీ–జాగీర్దారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలు సాగించిన పోరాటం, హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనమైన చారిత్రక పరిణామాలను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు, మహిళలు, యువతతో పాటు సామాన్య ప్రజలు చేసిన త్యాగాలను స్మరించుకోవాలని కోరారు.తెలంగాణ విమోచన చరిత్రను శాశ్వతంగా పరిరక్షించేందుకు బీజేపీ ప్రతిపాదించిన ‘తెలంగాణ సప్త సంకల్పాలు’ అమలు చేయాలని వారు వినతిపత్రంలో కోరారు. చరిత్ర పరిరక్షణ, అమరవీరుల త్యాగాల గౌరవం, జాతీయ సమైక్యతను బలోపేతం చేయడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకుడు మాస శ్రీనివాస్‌, సీనియర్‌ నాయకుడు చికిలం మెట్ల అశోక్‌, జిల్లా కార్యవర్గ సభ్యుడు జయరాపు రామకృష్ణ, నాయకులు గోషిక వెంకటేశం, కoచర్ల శంకర్‌రెడ్డి, దుడ్డు శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News