Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బీసీ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి: జిల్లా కలెక్టర్ 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 11, 2026 07:05 PM

బీసీ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి: జిల్లా కలెక్టర్

11-09-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

బీసీ మహిళలు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ల పంపిణీ పథకం కింద ఉచిత కుట్టు మిషన్లు అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. అర్హత ఉన్న మహిళలు సెప్టెంబర్ 15లోగా tgobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 18 నుంచి 55 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన బీసీ మహిళలు అర్హులు కాగా, నిరుద్యోగులు, నిరుపేదలు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, అనాథ మహిళలకు, అలాగే టైలరింగ్ శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. దరఖాస్తుదారులు ఆధార్, కులం, ఆదాయం, నివాసం, విద్యార్హత, రేషన్ కార్డు, టైలరింగ్ శిక్షణకు సంబంధించిన ధ్రువపత్రాలను సమర్పించాలి. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు ఉండాలి. కుటుంబంలో ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుందని, 2023–24లో బీసీ స్వయం ఉపాధి పథకం కింద ఆర్థిక లబ్ధి పొందిన వారు అర్హులు కాదని కలెక్టర్ స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల వారు సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారికి, పట్టణ ప్రాంతాల వారు సంబంధిత మున్సిపల్ కమిషనర్‌కు అవసరమైన ధ్రువపత్రాలతో సెప్టెంబర్ 15లోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

Sthanikam

బీసీ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి: జిల్లా కలెక్టర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News