Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వెంటనే స్పందించి.. తాగునీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్ 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 11, 2026 05:29 PM

​శ్రీ బాలాజీ రామకృష్ణ ఆలయంలో వైభవంగా కుంకుమార్చన

11-09-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో శ్రావణమాసం చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో మహిళా భక్తులతో కుంకుమార్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. వేద పండితులు బ్రహ్మశ్రీ సంతోష్ కుమార్ శాస్త్రి పంతులు వేద మంత్రోచ్ఛారణల నడుమ ఈ పూజా కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా పూర్తిచేశారు.

​ఈ వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి, అమ్మవార్ల దివ్య ఆశీస్సులు పూజలో పాల్గొన్న ప్రతి భక్తురాలికీ లభించాలని ఆకాంక్షించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో విలసిల్లాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులను ఈ సందర్భంగా ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ​పూజా అనంతరం భక్తులకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, అన్నదాన దాతలు, స్థానిక భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.

Sthanikam

​శ్రీ బాలాజీ రామకృష్ణ ఆలయంలో వైభవంగా కుంకుమార్చన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News