Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బీసీ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి: జిల్లా కలెక్టర్ 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 11, 2026 06:24 PM

కంగ్టి విద్యార్థులకు తప్పని బస్సు ఇబ్బందులు

11-09-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో కంగ్టి మండల కేంద్రంలోని పాఠశాలలు, కళాశాలలకు తడ్కల్, జంగికే, జంగిబి, ముర్కుంజాల్, రాసోల్, గాంధీనగర్ తదితర గ్రామాల నుంచి ప్రతిరోజూ విద్యార్థులు వస్తున్నారు. ఉదయం కంగ్టికి చేరుకునేందుకు బస్సు సౌకర్యం ఉన్నప్పటికీ, సాయంత్రం కళాశాలలు ముగిసిన తర్వాత గ్రామాలకు వెళ్లేందుకు సరైన బస్సు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.కళాశాలలు సాయంత్రం 4 గంటలకు ముగిసినా, గతంలో 5 గంటల సమయంలో వచ్చే బస్సు ప్రస్తుతం 6 గంటలకు వస్తుండటంతో విద్యార్థులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని తెలిపారు. దీంతో గ్రామాలకు చేరుకునే సమయానికి రాత్రి 7 గంటలు అవుతోందని, ముఖ్యంగా విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.విద్యార్థుల భద్రత, సమయాన్ని దృష్టిలో ఉంచుకుని కళాశాలలు ముగిసిన వెంటనే గ్రామాలకు వెళ్లేలా సాయంత్రం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయాలని విద్యార్థులు ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సమస్యను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

Sthanikam

కంగ్టి విద్యార్థులకు తప్పని బస్సు ఇబ్బందులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News