Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బీసీ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి: జిల్లా కలెక్టర్ 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 11, 2026 07:00 PM

జర్నలిస్టుల జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్

11-09-2026 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర చైర్మన్ తోగరి కరుణాకర్.

తెలంగాణ జర్నలిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు జేఏసీ రాష్ట్ర చైర్మన్ తోగరి కరుణాకర్ శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం ముత్యాల రమేష్ చేస్తున్న కృషిని గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.

రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జేఏసీ చైర్మన్ తోగరి కరుణాకర్‌కు ముత్యాల రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను జేఏసీ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, వారి హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.

ముత్యాల రమేష్ నియామకం పట్ల పలువురు జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు అభినందనలు తెలిపారు.

Sthanikam

జర్నలిస్టుల జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News