విద్యార్థులు నేర రహిత సమాజం కోసం కృషి చేయాలి
డీ ఎల్ ఎస్ ఏ ప్యానల్ అడ్వకేట్
ఆకుల మల్లేశ్
విద్యార్థి దశ నుండే చట్టాలపై అవగాహన పెంచుకుని నేరరహిత సమాజం కోసం కృషి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్యానల్ అడ్వకేట్ ఆకుల మల్లేశ్ కోరారు. శుక్రవారం భువనగిరి పటణంలోని చిలుముల శివరాజిని నారాయణరెడ్డి ( సి ఎస్ ఎన్ ఆర్) ప్రభుత్వ జూనియర్ కళాశాల లో విద్యార్థులకు భారతీయ చట్టాలపై ముఖ్యంగా "పోక్సో" చట్టం పై అవగాహన కల్పించారు. విద్యార్థులు ఉచిత న్యాయ సలహా కోసం 15100 టోల్ ఫ్రీ నెంబర్ కు మరియు 1098 టోల్ ఫ్రీ నెంబర్, అత్యవస సమయంలో 112 లేదా 100 నెంబర్ లకు ఫోన్ చేయాలని, సైబర్ నేరాలకు 1930 కి ఫోన్ చేయాలని సూచించారు. విద్యార్థులు భారతీయ చట్టాలపై సంపూర్ణ అవగాహన కలిగి , నేరరహిత సమాజం కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డి.అరుంధతి, కళాశాల లీగల్ సేల్ కో- ఆర్డినేటర్ ఆర్.అవనీధర్ గౌడ్, కే.కరుణాకర్ రెడ్డి, ఎన్.ప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి