అడ్డగూడూరు, సెప్టెంబర్ 11
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు సూచించారు. శుక్రవారం అడ్డగూడూరు మండలం మంగమ్మగూడెంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాలలోని స్టోర్‌రూమ్‌ను పరిశీలించిన అదనపు కలెక్టర్.. విద్యార్థులకు అందించేందుకు నిల్వ ఉంచిన కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. కూరగాయలు తాజాగా ఉన్నాయా? ఆహార పదార్థాలను పరిశుభ్రంగా, సక్రమంగా నిల్వ చేస్తున్నారా? అనే విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆహార పదార్థాలను నిర్దేశిత ప్రమాణాల ప్రకారం నిల్వ చేయాలని సూచించారు. పాఠశాల పరిసరాలు, వంటగది, స్టోర్‌రూమ్ తదితర ప్రాంతాల్లో పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని సిబ్బందికి స్పష్టం చేశారు.
కార్యక్రమంలో సంబంధిత అధికారులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి