వినాయకుడి ఆకృతిలో కూర్చొని.. భక్తి చాటుకున్న మల్లికార్జున పాఠశాల విద్యార్థులు
రానున్న వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పట్టణ కేంద్రంలోని మల్లికార్జున ఉన్నత పాఠశాల విద్యార్థులు శుక్రవారం వినూత్న రీతిలో భక్తిని చాటుకున్నారు. వరుస సెలవుల నేపథ్యంలో పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులంతా ఒకచోట చేరి విఘ్నేశ్వరుడి ఆకారంలో కూర్చొని ప్రదర్శించిన దృశ్యం విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణాధికారి మారెపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ.. విఘ్నాలను తొలగించే బొజ్జ గణపయ్య విద్యార్థులకు జ్ఞానం, వివేకం, ఏకాగ్రతను ప్రసాదిస్తాడన్నారు. స్వామివారి ఆదర్శాలను పుణికిపుచ్చుకుని విద్యార్థులు క్రమశిక్షణతో చదువులో రాణించాలని సూచించారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేస్తూ చేపట్టిన ఈ కార్యక్రమం అలరించిందని, విద్యార్థుల సృజనాత్మకత అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తోట లక్ష్మీదేవి, ఉపాధ్యాయులు మోనాలిక, ఎస్.బి.రాజ్, శైలజ, కవిత, దీపలక్ష్మి, హీనా, రజిత, సబిత, సానియా, సనా, సంతోష, నేహా, శృతి తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి