మెదక్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రేవ్, నాన్‌గ్రేవ్, మిస్సింగ్, ఎన్‌బీడబ్ల్యూ కేసులను సమీక్షించి, కేసులను అనవసరంగా పెండింగ్‌లో ఉంచకుండా సకాలంలో దర్యాప్తు పూర్తి చేసి చార్జ్‌షీట్లు దాఖలు చేయాలని సూచించారు. నేరాల దర్యాప్తులో సంఘటనా స్థలంలో లభించే ఆధారాలను పకడ్బందీగా సేకరించి, శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలను ఉపయోగించాలని తెలిపారు. మిస్సింగ్ కేసుల్లో ప్రత్యేక దృష్టి సారించి బాధితుల ఆచూకీ కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని, ఎన్‌బీడబ్ల్యూ కేసుల్లో వారెంట్ల అమలుపై శ్రద్ధ చూపాలని ఆదేశించారు.రాబోయే వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో శాంతిభద్రతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు. గణేష్ మండపాల నిర్వాహకులతో సమన్వయం చేసుకుంటూ విద్యుత్, అగ్నిప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విగ్రహ ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, నిమజ్జన మార్గాలు, రద్దీ ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. వీపీఓల సేవలను సమర్థవంతంగా వినియోగించుకుని అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం సమర్థవంతంగా కేసుల దర్యాప్తు చేసిన ఐఓలు రేణుకరెడ్డి, వెంకటరాజాగౌడ్,రంగా కృష్ణతో పాటు ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. సమావేశంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
వినాయక చవితికి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలి: మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి