మోటకొండూరు మండల పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో సమావేశం
యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో: శ్రీనివాస్
మోటకొండూరు మండల పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, యూత్ సభ్యులు,గ్రామ పెద్దలు,గణేష్ ఉత్సవ సమితి సభ్యులు మరియు మండపం నిర్వాహకులతో గణేష్ ఉత్సవ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.
మోటకొండూరు మండలంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ నందు మోటకొండూర్ పోలీసుల ఆధ్వర్యంలో మండలంలోని వివిధ శాఖల అధికారుల సమన్వయంతో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా,సురక్షితంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలు,పోలీసుల సూచనలు,వివిధ శాఖల సమన్వయం,మండపాల నిర్వాహకులు పాటించాల్సిన నిబంధనలు తదితర అంశాలపై చర్చించారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో,ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి శ్రీనివాస్ నాయుడు,సిఐ శంకర్,ఎం.ఆర్.ఓ విద్యుత్ శాఖ ఏఈ, గ్రామ సర్పంచులు,ఉప సర్పంచులు,మోటకొండూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది,యువజన సంఘాల నాయకులు,వివిధ కుల సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి