తిరుమలగిరి: హైదరాబాద్‌లోని కోఠి బీసీసీఈ భవన్‌లో నిర్వహించనున్న తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం (టిఎంజెఎఫ్) రాష్ట్ర 3వ మహాసభలకు తిరుమలగిరి మండల కమిటీ జర్నలిస్టులు బయలుదేరారు. ఈ సందర్భంగా టిఎంజెఎఫ్ రాష్ట్ర నాయకులు కళాశ్రీ ప్రవీణ్ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అన్యాయాలు,అక్రమాలపై పోరాడుతున్న జర్నలిస్టుల సమస్యలపై తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం నిరంతరం ఉద్యమిస్తూ పోరాటాలు సాగిస్తోందన్నారు. ఏ రంగంలో ఉన్నా కులవివక్ష తప్పడం లేదని, చిన్న, పెద్ద పత్రికలంటూ వివక్ష చూపుతూ జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారికి టిఎంజెఎఫ్ ధిక్కార స్వరంగా నిలుస్తూ జర్నలిస్టులకు అండగా ఉంటోందన్నారు. తిరుమలగిరి టీఎన్జేఎఫ్ మండల అధ్యక్షుడు బాకి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి నిర్మాళ్ల బాలకృష్ణ,దర్శనం శేఖర్, జోసెఫ్ ఉన్నారు.
PRINT TIME: September 12, 2026 03:49 PM
టిఎంజెఎఫ్ మహాసభలకు తిరుమలగిరి మండల కమిటీ జర్నలిస్టులు.

12-09-2026
1 Views
స్థానికం ప్రతినిధి :
thungathurthi
Bandi Kiran Kumar
తిరుమలగిరి: హైదరాబాద్‌లోని కోఠి బీసీసీఈ భవన్‌లో నిర్వహించనున్న తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం (టిఎంజెఎఫ్) రాష్ట్ర 3వ మహాసభలకు తిరుమలగిరి మండల కమిటీ జర్నలిస్టులు బయలుదేరారు. ఈ సందర్భంగా టిఎంజెఎఫ్ రాష్ట్ర నాయకులు కళాశ్రీ ప్రవీణ్ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అన్యాయాలు,అక్రమాలపై పోరాడుతున్న జర్నలిస్టుల సమస్యలపై తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం నిరంతరం ఉద్యమిస్తూ పోరాటాలు సాగిస్తోందన్నారు. ఏ రంగంలో ఉన్నా కులవివక్ష తప్పడం లేదని, చిన్న, పెద్ద పత్రికలంటూ వివక్ష చూపుతూ జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారికి టిఎంజెఎఫ్ ధిక్కార స్వరంగా నిలుస్తూ జర్నలిస్టులకు అండగా ఉంటోందన్నారు. తిరుమలగిరి టీఎన్జేఎఫ్ మండల అధ్యక్షుడు బాకి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి నిర్మాళ్ల బాలకృష్ణ,దర్శనం శేఖర్, జోసెఫ్ ఉన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి