విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి...
-విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు
-31వ వార్డు కౌన్సిలర్ సుమయ్య తబస్సుం
భువనగిరి పట్టణంలోని ఎలిమినేటి రుక్మమ్మ నర్సారెడ్డి మెమోరియల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో శుక్రవారం ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 31వ వార్డు కౌన్సిలర్ సుమయ్య తబస్సుం హాజరై కళాశాలలో నూతనంగా చేరిన విద్యార్థినులకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించి ఆహుతులను అలరించారు.కార్యక్రమంలో జిల్లా ఇంటర్ విద్యాధికారి సురేష్ రెడ్డి మాట్లాడుతూ...విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించి,ఉన్నత లక్ష్యాలను చేరుకోవడంతో పాటు తమ భవిష్యత్తును బంగారు బాటలో తీర్చిదిద్దుకోవాలని సూచించారు. అనంతరం వివిధ క్రీడా పోటీలలో ప్రతిభ కనబరిచి విజయం సాధించిన విద్యార్థినులకు బహుమతులను అందజేశారు.కళాశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ...విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి కళాశాలకు,తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు,సీఎస్‌ఎన్‌ఆర్(బి) ప్రభుత్వ జూనియర్ కళాశాల,భువనగిరి ప్రిన్సిపాల్ ఆనందిని,కళాశాల అధ్యాపకులు,విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి