మండల స్థాయి ఎస్‌జీఎఫ్ క్రీడల్లో 8 బహుమతులు కైవసం.
గట్టుప్పల్: మండల స్థాయి ఎస్‌జీఎఫ్ క్రీడల్లో వెల్మకన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తాచాటారు. శుక్రవారం వెల్మకన్నె గ్రామంలో నిర్వహించిన 70వ ఎస్‌జీఎఫ్ మండల స్థాయి క్రీడా పోటీల్లో వివిధ విభాగాల్లో ఏకంగా ఎనిమిది బహుమతులు సాధించి ప్రతిభ కనబరిచారు.
కబడ్డీలో అండర్–14 బాలికల విభాగంలో ప్రథమ, బాలుర విభాగంలో ద్వితీయ, అండర్–17 బాలికల విభాగంలో ప్రథమ బహుమతులు సాధించారు. వాలీబాల్‌లో అండర్–14 బాలికలు, బాలుర విభాగాల్లో ప్రథమ, అండర్–17 బాలుర విభాగంలో ప్రథమ, బాలికల విభాగంలో ద్వితీయ బహుమతులు దక్కించుకున్నారు. ఖోఖోలో అండర్–14, అండర్–17 బాలికల విభాగాల్లో ద్వితీయ బహుమతులు సాధించారు.
కార్యక్రమానికి మండల విద్యాధికారి అమృతాదేవి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి.రాములు అధ్యక్షత వహించారు. గ్రామ సర్పంచ్ రావుల స్వప్న రమేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని క్రీడాకారులకు భోజన వసతి కల్పించారు. అంతంపేట, నామాపురం, తెరట్పల్లి, గట్టుప్పల్ మండలాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.వెల్మకన్నె విద్యార్థులు అన్ని విభాగాల్లో ప్రతిభ కనబరిచి గ్రామానికి మంచి క్రీడా గ్రామంగా గుర్తింపు తీసుకురావడం అభినందనీయమని సర్పంచ్ స్వప్న రమేష్ పేర్కొంటూ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయ బృందం, ఫిజికల్ డైరెక్టర్ కొండ పరమేశంను ప్రధానోపాధ్యాయుడు బి.రాములు అభినందించారు.
క్రీడాకారులకు బహుమతులు అందజేసిన గ్రామస్తుడు మద్ది లక్ష్మారెడ్డి, మెడల్స్ అందజేసిన నామాపురం ప్రధానోపాధ్యాయుడు పురుషోత్తం రాజుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం కృతజ్ఞతలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి