Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 11, 2026 11:01 PM

మట్టి వినాయకులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడదాం

11-09-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఉచితంగా విగ్రహాల పంపిణీ చేసిన భారత్ సేవా సహకార ఫోరం

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత అని, రాబోయే వినాయక చవితి పండుగకు మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని చౌటుప్పల్ మున్సిపల్ మాజీ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు పిలుపునిచ్చారు. చౌటుప్పల్ పురపాలక కేంద్రంలో శుక్రవారం భారత్ సేవా సహకార ఫోరం ఆధ్వర్యంలో, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ సౌజన్యంతో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెన్‌రెడ్డి రాజు ప్రజలకు విగ్రహాలను పంపిణీ చేశారు. ​ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యుడు బొబ్బిళ్ళ మురళి మాట్లాడుతూ.. ప్రకృతిని పరిరక్షించాలనే లక్ష్యంతోనే తమ ఫోరం ద్వారా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో ట్రినిటీ విద్యాలయం డైరెక్టర్ అండ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఉజ్జిని మంజుల, మున్సిపల్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నరసింహ గౌడ్, శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ కమిటీ ధర్మకర్తలు ఆవుల యేసు యాదవ్, వరకాల రవి గౌడ్, బొబ్బిళ్ళ సామ్రాట్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మట్టి వినాయకులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడదాం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News