రైతులతో కలిసి బీఆర్‌ఎస్ నాయకుల ఆందోళన
సూర్యాపేట–జనగాం రోడ్డుపై బైఠాయింపు.. యార్కారం సబ్‌స్టేషన్ ఎదుట నిరసన వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ను కనీసం 12 గంటలపాటు నిరంతరాయంగా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ నాయకులు రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు. యార్కారం సబ్‌స్టేషన్ ఎదుట రైతాంగంతో కలిసి బీఆర్‌ఎస్ నాయకులు నిరసన తెలిపారు. అనంతరం సూర్యాపేట–జనగాం ప్రధాన రహదారిపై బైఠాయించి తమ డిమాండ్లను నెరవేర్చాలని నినాదాలు చేశారు.
వ్యవసాయానికి అవసరమైన సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి నాణ్యమైన 12 గంటల విద్యుత్ అందించాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించే వరకు వారికి అండగా నిలిచి పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. విద్యుత్ సరఫరా సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి