Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మునుగోడు యువతకు ‘ఆసరా’గా మెగా ఉద్యోగ మేళా: 50 పైగా సంస్థలు, 3,000 ఖాళీలు 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 12, 2026 08:56 PM

చౌటుప్పల్ లో అక్రమ సిమెంట్ ముఠా గుట్టురట్టు

12-09-2026 87 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

107 బస్తాల సిమెంట్ స్వాధీనం, ఇద్దరిపై కేసు నమోదు

చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా లూస్ సిమెంటును బస్తాలలో నింపుతున్న ముఠా గుట్టును పోలీసులు శనివారం రట్టు చేశారు. పోలీస్ ఇన్స్పెక్టర్ (ఎస్హెచ్ఓ) జి. మన్మధ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నమ్మదగిన సమాచారం మేరకు ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎస్హెచ్ఓ ఆదేశాల మేరకు ఏఎస్ఐ పి. కరుణాకర్ తంగేడు వనం వద్ద దాడి చేసి, అక్రమంగా బస్తాల్లో నింపుతున్న సుమారు 82 లూస్ సిమెంట్ బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే తూప్రాన్ పేట గ్రామంలో హెడ్ కానిస్టేబుల్ (1226) ఏ. సైదయ్య జరిపిన తనిఖీల్లో మరో 25 అక్రమ సిమెంట్ బస్తాలు పట్టుబడ్డాయి. మొత్తం 107 బస్తాల సిమెంటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ​ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులను విచారించగా, చౌటుప్పల్ టౌన్ కు చెందిన దేశగోని సుధాకర్ (45, తండ్రి: దానయ్య), చిట్యాలకు చెందిన గుండాల శ్రీను (50, తండ్రి: సోమయ్య)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Sthanikam

చౌటుప్పల్ లో అక్రమ సిమెంట్ ముఠా గుట్టురట్టు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News