హైదరాబాద్, సెప్టెంబర్ 12:
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శనివారం తెలంగాణ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నకిరేకల్‌లో ఇటీవల నిర్వహించిన ‘కేసీఆర్‌కు అండగా దళిత దండు’ కార్యక్రమంపై ఇరువురు చర్చించారు.కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు చిరుమర్తి లింగయ్యను కేటీఆర్ అభినందించారు. ప్రజా సమస్యలపై మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అండగా నిలవాలని, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించినట్లు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి