Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డీజేలకు అనుమతి లేదు.. ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. సీఐ మెలుగు రవి, ఎస్‌ఐ గోపాతి సతీష్‌ సూచనలు. 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 12, 2026 10:55 PM

ఏచూరి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి. రామన్నపేటలో సీపీఎం ఆధ్వర్యంలో ఘన నివాళులు

12-09-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, సెప్టెంబర్‌ 12:

ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, దేశ సమైక్యత కోసం తుది శ్వాస వరకు పోరాడిన మార్క్సిస్టు మేధావి, మాజీ ఎంపీ కామ్రేడ్‌ సీతారాం ఏచూరి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సీపీఎం మండల కార్యవర్గ సభ్యుడు కల్లూరి నగేష్‌ అన్నారు. ఏచూరి రెండో వర్ధంతి సందర్భంగా శనివారం రామన్నపేట పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నగేష్‌ మాట్లాడుతూ.. మతోన్మాద, మనువాద శక్తులకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య, అభ్యుదయ, లౌకిక శక్తులను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఏచూరి కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన మార్క్సిస్టు నేతగా ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు.

కార్యక్రమంలో మండల కార్యదర్శివర్గ సభ్యుడు కందుల హనుమంతు, మండల కమిటీ సభ్యులు బావుండ్లపల్లి బాలరాజు, గొరిగే సోములు, పట్టణ కార్యదర్శి మునుకుంట్ల లెనిన్, ఆముద ఆంజనేయులు, దూదిమెట్ల సైదులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఏచూరి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి. రామన్నపేటలో సీపీఎం ఆధ్వర్యంలో ఘన నివాళులు

Article Image

రామన్నపేట, సెప్టెంబర్‌ 12:

ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, దేశ సమైక్యత కోసం తుది శ్వాస వరకు పోరాడిన మార్క్సిస్టు మేధావి, మాజీ ఎంపీ కామ్రేడ్‌ సీతారాం ఏచూరి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సీపీఎం మండల కార్యవర్గ సభ్యుడు కల్లూరి నగేష్‌ అన్నారు. ఏచూరి రెండో వర్ధంతి సందర్భంగా శనివారం రామన్నపేట పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నగేష్‌ మాట్లాడుతూ.. మతోన్మాద, మనువాద శక్తులకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య, అభ్యుదయ, లౌకిక శక్తులను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఏచూరి కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన మార్క్సిస్టు నేతగా ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు.

కార్యక్రమంలో మండల కార్యదర్శివర్గ సభ్యుడు కందుల హనుమంతు, మండల కమిటీ సభ్యులు బావుండ్లపల్లి బాలరాజు, గొరిగే సోములు, పట్టణ కార్యదర్శి మునుకుంట్ల లెనిన్, ఆముద ఆంజనేయులు, దూదిమెట్ల సైదులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News