నల్లగొండ: నల్లగొండ నగర గణేష్ ఉత్సవాల సమితి కార్యాలయాన్ని ఆదివారం పట్టణంలోని రిజిస్టర్ ఆఫీస్ వైపు ఏబీవీపీ కార్యాలయం పైభాగంలో సమితి అధ్యక్షుడు కర్నాటి యాదగిరి, ప్రధాన కార్యదర్శి కట్ట సూర్య సంపత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆదివారం నుంచి నగరంలోని అన్ని గణేష్ మండపాల నిర్వాహకులకు సమితి కార్యాలయం అందుబాటులో ఉంటుందని తెలిపారు. సోమవారం నుంచి నగరంలో గణేష్ ఉత్సవాల అలంకరణ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పారు.
సెప్టెంబర్ 14న గణేష్ చతుర్దశి, సెప్టెంబర్ 23న నిమజ్జనం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లపై ఇప్పటికే కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీ, ఆర్డీవో, తహసీల్దార్, విద్యుత్ శాఖ, మున్సిపల్ అధికారులతో చర్చించినట్లు తెలిపారు. మండపాల నిర్వాహకులు సమన్వయంతో భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహించుకోవాలని సూచించారు.కార్యక్రమంలో కోశాధికారి ఓరుగంటి శ్రీనివాస్, కార్యాలయ కార్యదర్శి బజరంగ్ దళ్ నరసింహ, మాంద నగేష్, రావిరాల కాశమ్మ, గుండ్ల అంజిరెడ్డి, కార్పొరేటర్ వంగూరి రాఖీ, రాంప్రసాద్, హరేరాం, వనం శ్రీకిషన్, రాయల కృష్ణయ్య, బల్లెం యాదగిరి, హైమవతి, రంగరాజు సాత్విక్, అన్న రవి, దుగ్యాల క్రాంతి, వెంకటేష్, ప్రభాకర్, శివరాం, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి