రామన్నపేట: జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా రామన్నపేట కోర్టుల పరిధిలో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్‌లో పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యాయి. మండల న్యాయ సేవా కమిటీ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి జి.సబిత ఆధ్వర్యంలో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టుల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు.
లోక్ అదాలత్‌లో 77 క్రిమినల్, 3 సివిల్, 6 బ్యాంకు ప్రీ–లిటిగేషన్, 735 ఈ–పెట్టి, 755 డీడీ కేసులు.. మొత్తం 1,576 కేసులు పరిష్కరించారు. బ్యాంకు ప్రీ–లిటిగేషన్ కేసులకు సంబంధించి రూ.1,09,870, ఈ–పెట్టి కేసులకు సంబంధించి రూ.7,350 మొత్తాన్ని పరిష్కరించారు.
కేసుల పరిష్కారంతో కక్షిదారులకు సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు పరస్పర అంగీకారంతో వివాదాలకు సత్వర పరిష్కారం లభించిందని న్యాయమూర్తులు తెలిపారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి శిరీష, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసు, బ్యాంకు అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి