భక్తిశ్రద్ధలతో తరలివచ్చిన భక్తజనం.
నల్లగొండ: పట్టణంలోని రామగిరి ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారి రథోత్సవ వేడుకలు ఆదివారం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తుల రాకతో సందడిగా మారింది. రథోత్సవాన్ని తిలకించేందుకు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని తమ కోరికలు నెరవేరాలని భక్తులు ప్రత్యేకంగా ప్రార్థించారు.ఈ సందర్భంగా ఆలయ పూజారి వెలిజాల అంజయ్య మాట్లాడుతూ.. ప్రతి ఏడాది అమ్మవారి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ముత్యాలమ్మను భక్తిశ్రద్ధలతో కొలిచే వారికి అమ్మవారి అనుగ్రహం ఉంటుందనే నమ్మకం భక్తుల్లో బలంగా ఉందన్నారు. తమ కోరికలు నెరవేరాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తుంటారని పేర్కొన్నారు.
కార్యక్రమంలో నల్లగొండ పట్టణ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్ అబ్బగోని కవిత రమేష్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం రథోత్సవాన్ని తిలకించారు. భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి