నల్లగొండ: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతులను ప్రతిష్ఠించాలని నల్లగొండ డీఎస్పీ కే. శివరాం రెడ్డి సూచించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల వద్ద ఎంఎస్ న్యూస్ 24X7 ఛానల్ ఆధ్వర్యంలో ఆదివారం మట్టి గణపతి విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఛానల్ ఎండీ గుంటోజు మహేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డీఎస్పీ శివరాం రెడ్డి మట్టి గణపతుల పంపిణీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాల నిమజ్జనం వల్ల నీటి కాలుష్యం పెరిగే అవకాశం ఉందన్నారు. సహజమైన మట్టి విగ్రహాలను వినియోగించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. వినాయక చవితి సందర్భంగా పర్యావరణహితమైన మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.
కార్యక్రమంలో వాకర్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ పుల్లారావు, ట్రాఫిక్ ఎస్‌ఐ విజయభాయి, ఎంఎస్ న్యూస్ 24X7 ఎండీ గుంటోజు మహేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి