బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తీరుపై కాంగ్రెస్ మండల నాయకుడు గోలి నరేష్ మండిపాటు.
చిట్యాల: శాసనసభ నుంచి సస్పెండ్ అయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మాక్ అసెంబ్లీ నిర్వహించి అసెంబ్లీ సమావేశాలను, స్పీకర్ పదవిని అపహాస్యం చేయడం సరికాదని కాంగ్రెస్ మండల నాయకుడు గోలి నరేష్ రజక అన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితం కావడం దురదృష్టకరమన్నారు. బీఆర్‌ఎస్ పాలనపై ప్రజలు ఇప్పటికే తీర్పు ఇచ్చారని, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు.
ఇటీవల అసెంబ్లీ గేటు వద్ద నిరసన సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేలు.. మాక్ అసెంబ్లీ నిర్వహించి స్పీకర్‌ను వెక్కిరిస్తూ, ముఖ్యమంత్రి హోదాను కించపరిచేలా మాట్లాడటం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజాధనం దుర్వినియోగమైందని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ కార్యదర్శి తాటికొండ సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకుడు అంశాల శ్రవణ్‌కుమార్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఉమ్మెత్తల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి