ఇబ్రహీంపట్నం: తెలంగాణ ఉద్యమకారుల హక్కులు, సంక్షేమం, గుర్తింపు కోసం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (TUF) ఆధ్వర్యంలో ఈ నెల 15న ‘9 ఏండ్లు–9 కిలోమీటర్ల మహా పాదయాత్ర’ నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం 8 గంటలకు చేపట్టనున్న పాదయాత్రకు ముఖ్య అతిథిగా హాజరై విజయవంతం చేయాలని కోరుతూ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిని ఫోరం నాయకులు కలిసి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జెనిగె విష్ణువర్ధన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొంతం యాదిరెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కారింగుల నరేందర్‌గౌడ్, రంగారెడ్డి జిల్లా ప్రచార కార్యదర్శి గోగికార్ కిషోర్‌లాల్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు ప్రభుత్వం తగిన గుర్తింపు, సంక్షేమం కల్పించే వరకు పోరాటం కొనసాగిస్తామని వారు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి