Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
12 వ వార్డులో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 13, 2026 08:57 PM

చేర్లరాయిపల్లిలో ఘనంగా సప్తాహ వేడుకల ముగింపు

13-09-2026 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రాయికోడ్ మండలం చేర్లరాయిపల్లి గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఏడు రోజులుగా నిర్వహించిన సప్తాహ వేడుకలు ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా ముగిశాయి. ముగింపు సందర్భంగా ఆంజనేయ స్వామి, శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు, పుష్పార్చనలు నిర్వహించి భక్తులు దైవనామస్మరణ, భజనలు, కీర్తనల్లో పాల్గొన్నారు.ఏడు రోజుల పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కీర్తనకారులు రాత్రివేళల్లో భజనలు, కీర్తనలతో భక్తులను అలరించారు.ముగింపు వేడుకల్లో పల్లకి సేవ, ఉట్టికొట్టే కార్యక్రమంతో పాటు భక్తులకు అన్నదానం నిర్వహించారు. గ్రామంలోని ఆలయాల వద్ద కాషాయ జెండాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ కాశి బస్వరాజ్ పాటిల్, ఉపసర్పంచ్ అంజయ్య, మాజీ సర్పంచ్ అడివయ్య బీరయ్య, మాజీ ఉపసర్పంచ్ కుమ్మరి అశోక్‌తో పాటు గ్రామ పెద్దలు, భక్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చేర్లరాయిపల్లిలో ఘనంగా సప్తాహ వేడుకల ముగింపు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News