పర్యావరణ పరిరక్షణలో భాగంగా చౌటుప్పల్ పురపాలక కేంద్రంలోని 12వ వార్డులో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భారత్ సేవా సహకార ఫోరం చైర్మన్ బసవరాజు శ్రీనివాస్, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం చైర్మన్ సౌజన్యంతో, ఫోరం ట్రస్ట్ మెంబర్ బొబ్బిళ్ళ మురళి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
స్థానిక కౌన్సిలర్ చిరంజీవి, మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షులు బొంగు జంగయ్య గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రజలకు విగ్రహాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కరోనా కష్టకాలం నుంచి భారత్ సేవా సహకార ఫోరం అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని కొనియాడారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని రక్షించేందుకు మట్టి గణపతులనే పూజించాలని పిలుపునిచ్చారు. సామాజిక స్పృహ కల్పిస్తూ ముందుకెళ్తున్న సంస్థ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్‌కు 12వ వార్డు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాంతినగర్ కాలనీ అధ్యక్షుడు పెద్దగోని రమేష్ గౌడ్, శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ ధర్మకర్తలు వర్కాల రవి గౌడ్, ఆవుల యేసు యాదవ్, దాడి యశ్వంత్ రెడ్డి, వార్డు నాయకులు బెదరకోట ఈశ్వర్, రమేష్, కనకమోని శ్రీనివాస్, చెవ్వగొని వెంకటేష్ గౌడ్, జక్కర్తి శేఖర్, తమ్మకొండ రాజు, అల్లి కృష్ణ, తమ్మకొండ శ్రీను, బుంగపట్ల రవి, జక్కర్తి సుధా, బొబ్బిళ్ళ సామ్రాట్, కడలి హేమంత్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి