చౌటుప్పల్‌లో లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవా ఆధ్వర్యంలో ఉచిత విగ్రహాల పంపిణీ
వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలనే పూజించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించాలని చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ కోరారు. లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవా ఆధ్వర్యంలో, చౌటుప్పల్ సుధా పిల్లల ఆసుపత్రి వైద్యులు డాక్టర్ అవ్వారు శ్రీనివాస్ ప్రసాద్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై, ప్రజలకు విగ్రహాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాల వల్ల నీటి వనరులు తీవ్రంగా కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు. సహజసిద్ధమైన మట్టి విగ్రహాలను పూజించడం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా గత పదేళ్లుగా లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవా ఆధ్వర్యంలో ప్రతి ఏటా వందలాది మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ ఉప్పు ఆంజనేయులు, అధ్యక్షుడు ఎండీ అతహర్ పాషా, ట్రెజరర్ బత్తిని రఘు, సభ్యులు గోశిక కరుణాకర్, కాసుల వెంకటేశం, కొసనం రామ్‌రెడ్డి, పోలోజు శ్రీనివాసచారి, కటకం ప్రశాంత్, కామిశెట్టి చంద్రశేఖర్ గుప్తా, చిలువేరు మంగయ్య, వనం రాజు, దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, అయ్యాడపు ప్రతాపరెడ్డి, సురోజు సత్యనారాయణచారి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి