Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 19 న కోదాడ లో పెద్ద ఎత్తున జాబ్ మేళా 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 14, 2026 09:42 AM

నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 19 న కోదాడ లో పెద్ద ఎత్తున జాబ్ మేళా

14-09-2026 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

సమాజంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, యువత ఉన్నత చదువులు చదువుకొని ఎలాంటి ఉద్యోగం లభించక నిరుద్యోగంతో కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని, అందుకే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 19 న కోదాడ పట్టణంలోని సి సి రెడ్డి కాన్వెంట్ లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డితో కలిసి కోదాడ సి సి కాన్వెంట్ లో ఈ నెల 19 న నిర్వహించే మెగా జాబ్ మేళా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.సింగరేణి కంపెనీ, పరిశ్రమల శాఖ, కార్మిక శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళా లో ఐటి, సేవా, నిర్మాణ, వాణిజ్య, ఫార్మారంగలకు చెందిన 250 నుండి 300 పై చిలుకు కంపెనీలు హాజరుకానుండగా, సుమారు 4000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు పక్కన ఉన్న ఖమ్మం జిల్లా నుండి నిరుద్యోగ యువత ఇట్టి ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అలాగే సూర్యాపేట కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గాల నుండి నిరుద్యోగులు అత్యధికంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉదయం 9 గంటల నుండి రాత్రి 9:00 వరకు ఇంటర్వ్యూలు ఉంటాయని ఇంటర్వ్యూలలో ఉద్యోగం సంపాదించిన వారికి వెంటనే ఆర్డర్స్ ఇవ్వబడుతాయని అన్నారు.తదుపరి మంత్రి జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరించి క్యూ ఆర్ కోడ్ ద్వారా నిరుద్యోగ యువత రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, అభ్యర్థులకు ముందుగానే ఏ కంపెనీకి అర్హత ఉందో తెలిపే విధంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తామని అన్నారు.ఈ సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ నరసింహ, కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణ, హుజూర్నగర్ ఆర్డీవో శ్రీనివాసులు, కోదాడ మున్సిపల్ కమిషనర్ రమాదేవి, గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు,వివిధ కంపెనీల ప్రతినిధులు కోదాడ హుజూర్నగర్ తాసిల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 19 న కోదాడ లో పెద్ద ఎత్తున జాబ్ మేళా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News