Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 19 న కోదాడ లో పెద్ద ఎత్తున జాబ్ మేళా 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 14, 2026 10:30 AM

బోరంచ శ్రీ నల్లపోచమ్మ ఆలయం వద్ద రేకుల షెడ్డు ప్రారంభం

14-09-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామ శివారులో మంజీరా నది ఒడ్డున ఉన్న ప్రసిద్ధ శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద జగద్గిరిగుట్ట రాధాకృష్ణ కురుమ యాదవ సంఘం ఆధ్వర్యంలో సుమారు రూ.80 వేల వ్యయంతో 50 అడుగుల రేకుల షెడ్డు నిర్మించారు. ఈ షెడ్డు ప్రారంభోత్సవానికి జగద్గిరిగుట్ట మాజీ కార్పొరేటర్ కె. జగన్, బీజేపీ మేడ్చల్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు శేఖర్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్, నారాయణఖేడ్ కురుమ యాదవ సంఘం అధ్యక్షుడు ప్రభాకర్, ప్రముఖులు సింహా యాదవ్ తదితరులు హాజరై షెడ్డును ప్రారంభించారు.దాతలు, ప్రముఖులను ఆలయ మాజీ చైర్మన్ మల్లయ్య శాలువాలతో సన్మానించగా, ఆలయ అర్చకులు సిద్ధయ్య స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదాలు అందించారు. కార్యక్రమంలో బోరంచ సర్పంచ్ బీరప్ప, సంఘం అధ్యక్షుడు అంజన్న, పండరి, హన్మంతు యాదవ్, చి. శేఖర్, దశరథ్, ప్రభాకర్, గండి రాజు, మోటికి అంజన్న, సంఘం సభ్యులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, గ్రామ ప్రజలు, ఆలయ భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బోరంచ శ్రీ నల్లపోచమ్మ ఆలయం వద్ద రేకుల షెడ్డు ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News