నకిరేకల్: ఉపాధ్యాయులు సమాజ మనుగడకు తోడ్పడుతూ, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేయాలని గౌరవ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం అన్నారు. 80 వసంతాలు పూర్తి చేసుకున్న ఎస్‌టీయూ-టీఎస్ వైభవోత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను సోమవారం ఎమ్మెల్యే వేముల వీరేశం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. పాఠశాలల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్‌టీయూ-టీఎస్ అధ్యక్షులు ఇండ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కల్లూరి రమేష్, రాష్ట్ర కార్యదర్శి బకనగారి జంగయ్య, ఏఐఎస్‌టీఎఫ్ కౌన్సిల్ మెంబర్ బొమ్మగాని నాగభూషణం, ఎస్‌టీయూ నాయకులు నరసింహ, వెంకటేశ్వర్లు, ఉయ్యాల బిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి