నేషనల్ ట్రోఫీ విజేతను అభినందించిన పురపాలక చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్
కుంగ్ ఫూ కరాటే నేషనల్ లెవెల్ ఛాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచిన చౌటుప్పల్‌కు చెందిన చుక్క మణిచరణ్‌ను మంగళవారం చౌటుప్పల్ పురపాలక చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. మణిచరణ్ జాతీయ స్థాయిలో ఛాంపియన్‌షిప్ ట్రోఫీని కైవసం చేసుకోవడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులోనూ ఇదే తరహా ప్రతిభను కనబరుస్తూ మరిన్ని జాతీయ, అంతర్జాతీయ ట్రోఫీలు గెలుపొందాలని, తన వృత్తిపరమైన రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి చౌటుప్పల్ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ చింతల ఉమామహేశ్వరి సాయిలు, పాక చిరంజీవి, కో-ఆప్షన్ సభ్యులు బాబా షరీఫ్, ఐఎన్టీయూసీ నాయకులు ముత్యాల గణేష్ తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి