Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
(TUWJ–IJU) నూతన కమిటీ సభ్యులకు మున్సిపల్ చైర్మన్ ఘన సన్మానం హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 15, 2026 05:11 PM

మనూర్ జూనియర్ కళాశాలకు సొంత భవనం నిర్మించాలి

15-09-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మనూర్: ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సొంత భవనం నిర్మించి, విద్యార్థులకు సరిపడా తరగతి గదులు, ప్రయోగశాలలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎస్‌ఎఫ్‌ఐ నారాయణఖేడ్ డివిజన్ కార్యదర్శి స్వరాజ్ డిమాండ్ చేశారు. మంగళవారం ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్‌కు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం కళాశాలలో గదులు సరిపోకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, కొన్ని సందర్భాల్లో వరండాల్లో కూర్చొని తరగతులు వినాల్సి వస్తోందని తెలిపారు. ల్యాబ్‌లకు ప్రత్యేక గదులు లేక విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగుతోందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కళాశాలకు సొంత భవనం నిర్మించడంతో పాటు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కోరారు.

Sthanikam

మనూర్ జూనియర్ కళాశాలకు సొంత భవనం నిర్మించాలి

Article Image

మనూర్: ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సొంత భవనం నిర్మించి, విద్యార్థులకు సరిపడా తరగతి గదులు, ప్రయోగశాలలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎస్‌ఎఫ్‌ఐ నారాయణఖేడ్ డివిజన్ కార్యదర్శి స్వరాజ్ డిమాండ్ చేశారు. మంగళవారం ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్‌కు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం కళాశాలలో గదులు సరిపోకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, కొన్ని సందర్భాల్లో వరండాల్లో కూర్చొని తరగతులు వినాల్సి వస్తోందని తెలిపారు. ల్యాబ్‌లకు ప్రత్యేక గదులు లేక విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగుతోందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కళాశాలకు సొంత భవనం నిర్మించడంతో పాటు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News