హైదరాబాద్: తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) సోషల్, డిజిటల్ మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బొల్లంపల్లి సందీప్ నియమితులయ్యారు. పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత నియామక ఉత్తర్వుల పత్రాన్ని సందీప్‌కు అందజేశారు. ఈ సందర్భంగా తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన కవితకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తిస్తానన్నారు.
పార్టీ కార్యక్రమాలు, విధానాలను డిజిటల్ వేదికల ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని సందీప్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సోషల్, డిజిటల్ మీడియా విభాగాన్ని బలోపేతం చేయడంతోపాటు పార్టీ శ్రేణులు, సోషల్ మీడియా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి