Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజలకు ఇబ్బంది లేకుండా బైపాస్ రోడ్డు అభివృద్ధి చేయాలి:టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 16, 2026 06:34 PM

ఏసీపీ సుమతి ఆపరేషన్‌.. 24 గంటల్లో చిక్కిన నిందితులు..9 మంది అరెస్ట్‌.. మరో నలుగురు పరారీ.

16-09-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హత్యకు దారి తీసిన 5 కీలక అంశాలు

నయీమ్‌ హత్య కేసు ఛేదన

ఏసీపీ పర్యవేక్షణలో ఎస్‌ఓటీ, నాగోల్‌ పోలీసులు సమన్వయంతో దర్యాప్తు చేపట్టి నయీమ్‌ హత్య కేసును ఛేదించారు. కేసులో తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేయగా.. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పాత కక్షలు, వివాదాల నేపథ్యంలోనే హత్యకు పథకం రచించినట్లు దర్యాప్తులో తేలింది.మల్కాజిగిరి పోలీస్‌ కమిషనర్‌ బి.సుమతి, ఐపీఎస్‌ వివరాల ప్రకారం.. సెప్టెంబర్‌ 14న బండ్లగూడలోని సుప్రీం వైన్స్‌ సమీపంలో నయీమ్‌పై దాడి చేసి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి నిందితుల కదలికలపై దృష్టి సారించారు.

ఎల్‌బీనగర్‌ జోన్‌ డీసీపీ బి.అనురాధ, ఐపీఎస్‌ మార్గదర్శకత్వంలో ఏసీపీ ప్రత్యక్ష పర్యవేక్షణతో ఎస్‌ఓటీ, నాగోల్‌ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.కేసులో సయ్యద్‌ రబ్బానీ, ఓట్ల దినేష్‌, వోలిపిల్ల మహేష్‌, రాసుమల్ల సాకేత్‌, అలకుంట వెంకట్‌, కొడిగంటి రాఘవేందర్‌ అలియాస్‌ రఘు, వల్లపుదాసు చరణ్‌గౌడ్‌, మహ్మద్‌ బద్రుల్లా హుస్సేన్‌, తొడేటి వెంకటేష్‌లను అరెస్టు చేశారు.

కనకం ఉమామహేష్‌, మహ్మద్‌ ఇస్మాయిల్‌ జాబీ, భోలే, కార్తీక్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి వేట కొడవలి, ఇనుపరాడ్‌, టయోటా వాహనం, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

Sthanikam

ఏసీపీ సుమతి ఆపరేషన్‌.. 24 గంటల్లో చిక్కిన నిందితులు..9 మంది అరెస్ట్‌.. మరో నలుగురు పరారీ.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News