సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్డు అభివృద్ధి పనులను ప్రజలు, వ్యాపారులకు నష్టం కలగకుండా చేపట్టాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం బసవేశ్వర విగ్రహం నుంచి ఎల్‌ఐసీ కార్యాలయం వరకు హెచ్‌ఎండీఏ, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన పర్యటించి రోడ్డు పరిస్థితిని పరిశీలించారు.బైపాస్ రోడ్డు అభివృద్ధి కోసం తాను రూ.18 కోట్ల నిధులు తీసుకొచ్చానని తెలిపారు. 80 అడుగుల రోడ్డు కోసం సుమారు 180 భవనాలను కూల్చాల్సి వస్తుందని, వారికి కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. ప్రజల ఇళ్లు, దుకాణాలు, మెట్లు తొలగించాల్సిన అవసరం లేకుండా సుమారు 50 అడుగుల రోడ్డును అభివృద్ధి చేయవచ్చని పేర్కొన్నారు. బిల్డింగ్ యజమానులు, ఫుట్‌పాత్ వ్యాపారులకు నష్టం కలగకుండా, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా రోడ్డు నిర్మాణం చేపట్టడమే తన ఉద్దేశమన్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే అధికారులకు ఫిర్యాదులు చేస్తూ పనులను అడ్డుకుంటున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. 80 అడుగుల రోడ్డు అవసరమని భావిస్తే ఎమ్మెల్యే బైపాస్ రోడ్డుపైకి వచ్చి ప్రజల సమక్షంలో కూల్చివేతలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. అభివృద్ధి పేరుతో ప్రజలకు ఆస్తి నష్టం కలగకుండా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారంతో రోడ్డు అభివృద్ధి చేయాలని ఆయన అన్నారు.
ప్రజలకు ఇబ్బంది లేకుండా బైపాస్ రోడ్డు అభివృద్ధి చేయాలి:టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి