భువనగిరి: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (బీఆర్ఏఓయూ)లో 2026–27 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాలు కొనసాగుతున్నాయని ఎడ్యుకేషన్ ఎక్స్‌టెన్షన్ సెంటర్ నోడల్ అధికారి డాక్టర్ బి. ధర్మ నాయక్ తెలిపారు. మంగళవారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళాశాల అధ్యయన కేంద్రంలో కౌన్సిలర్ల సమావేశం నిర్వహించారు. బీఏ, బీకాం, బీఎస్సీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 30 చివరి తేదీ అని తెలిపారు. ఆదివాసీలు, ట్రాన్స్‌జెండర్లు, దివ్యాంగులకు ఉచితంగా ఉన్నత విద్య అభ్యసించే అవకాశం ఉందన్నారు.
మహిళలకు వ్యాపార శిక్షణ
మహిళా విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు బీఆర్ఏఓయూ–వీహబ్ ఆధ్వర్యంలో వ్యాపారాభివృద్ధి, నైపుణ్య శిక్షణ, మార్గదర్శకత్వం అందించనున్నట్లు తెలిపారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు అనుగుణంగా నూతన కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. విద్యార్థులకు ఉపాధి అవకాశాల కోసం టీసీఎస్, ఐకాన్, రామానంద తీర్థ ఇన్‌స్టిట్యూట్, రాశి, వి–హబ్ తదితర సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచి కళాశాలలోనే సైన్స్ ప్రాక్టికల్ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్. శ్రీనివాస్, కో–ఆర్డినేటర్ డాక్టర్ రమేశ్ గంజి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి