Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
త్రిశూల్ యూత్ వినాయక మండపానికి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ రాక బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 16, 2026 07:26 PM

సిబ్బంది సంక్షేమానికి ఎల్లవేళలా కృషి: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్...

16-09-2026 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

సిబ్బంది సంక్షేమానికి ఎల్లవేళలా కృషి.. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్

జిల్లా పోలీస్ సిబ్బందికి రెయిన్ కోట్స్ అందజేసిన జిల్లా ఎస్పీ...

నల్లగొండ: పోలీస్ సిబ్బంది సంక్షేమానికి జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ తెలిపారు. వర్షాకాలంలో విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిబ్బందికి రెయిన్ కోట్స్ అందజేశారు. వర్షాలు కురుస్తున్న సమయంలో ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు, పెట్రోలింగ్, ఇతర విధుల్లో సిబ్బంది నిరంతరం విధులు నిర్వహించాల్సి ఉంటుందని, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా వారు సమర్థవంతంగా విధులు నిర్వహించేలా అవసరమైన సౌకర్యాలు కల్పించడం పోలీస్ శాఖ బాధ్యత అని ఎస్పీ తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, వర్షాకాలంలో పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రెయిన్ కోట్స్ అందజేయడం జరిగిందని తెలిపారు. ప్రజల భద్రత కోసం ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా క్రమశిక్షణతో, అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్క పోలీస్ సిబ్బందికి జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు ఆరోగ్యం, సంక్షేమం పట్ల కూడా శ్రద్ధ వహించాలని ఎస్పీ సూచించారు. విధి నిర్వహణలో సిబ్బందికి ఏవైనా సమస్యలు లేదా ఇబ్బందులు ఎదురైతే వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, రక్షణ పరికరాలు తదితరాలను అందుబాటులో ఉంచేందుకు జిల్లా పోలీస్ శాఖ నిరంతరం చర్యలు తీసుకుంటుందని ఎస్పీ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఏ.ఆర్. డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్.ఐలు సంతోష్, శ్రీను మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

సిబ్బంది సంక్షేమానికి ఎల్లవేళలా కృషి: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్...

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News