Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బస్సులు గ్రామంలోకి రావాలి.. కళాశాల విద్యార్థులు ప్రజల డిమాండ్ బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 16, 2026 08:29 PM

మండపాల వద్ద డ్రగ్స్‌పై అవగాహన

మండపాల వద్ద డ్రగ్స్‌పై అవగాహన

మండపాల వద్ద డ్రగ్స్‌పై అవగాహన
16-09-2026 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గణేష్‌ సురక్ష సంకల్ప్‌–2026లో భాగంగా కార్యక్రమాలు

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

నాగోల్‌, సెప్టెంబర్‌ 16 గణేష్‌ ఉత్సవాలను పురస్కరించుకుని మల్కాజిగిరి పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో సీపీ బి.సుమతి ఐపీఎస్‌ చేపట్టిన ‘గణేష్‌ సురక్ష సంకల్ప్‌–2026’లో భాగంగా గణేష్‌ మండపాల వద్ద డ్రగ్స్‌ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నాగోల్‌ ఇన్‌స్పెక్టర్‌ మక్బూల్‌ జానీ ఆధ్వర్యంలో బ్లైండ్స్‌ కాలనీ ఎస్‌హెచ్‌జీ మహిళలతో కలిసి డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అవగాహన కల్పించారు.

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్‌ వినియోగం వల్ల ఆరోగ్యం, కుటుంబం, సామాజిక జీవితంపై ప్రతికూల ప్రభావాలు పడతాయని అధికారులు వివరించారు. డ్రగ్స్‌ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ముఖ్యంగా తల్లిదండ్రులు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కార్యక్రమంలో ఎల్‌బీనగర్‌ ట్రాఫిక్‌ డీసీపీ వి.శ్రీనివాసులు, టీఎస్‌ న్యాబ్‌ ఈగల్‌ టీమ్స్‌ డీఎస్పీ శ్రీనివాస్‌, నాగోల్‌ ఎస్‌ఐ ఉమాతో పాటు ఎస్‌హెచ్‌జీ సభ్యులు ఉమా, పుష్ప, కవిత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్‌ నిర్మూలనకు ప్రజలు పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.

Sthanikam

మండపాల వద్ద డ్రగ్స్‌పై అవగాహన

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News