నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూర్ మండల కేంద్రం మీదుగా జాతీయ రహదారి 161పై బస్సులు వెళ్తున్నప్పటికీ, గ్రామంలోకి బస్సులు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పాఠశాల, కళాశాల విద్యార్థులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో బుధవారం గ్రామస్తులు, విద్యార్థులు కలిసి జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. బస్సులు గ్రామం మీదుగా నడిపించి ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మనూర్ గ్రామంలోకి బస్సులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ధర్నాలో మన్నాన్ పటేల్, కాజా సాబ్, కార్తీక్ రెడ్డి, అంజన్నతో పాటు పలువురు గ్రామస్తులు, పాఠశాల, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
PRINT TIME: September 16, 2026 09:10 PM
బస్సులు గ్రామంలోకి రావాలి.. కళాశాల విద్యార్థులు ప్రజల డిమాండ్

16-09-2026
23 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూర్ మండల కేంద్రం మీదుగా జాతీయ రహదారి 161పై బస్సులు వెళ్తున్నప్పటికీ, గ్రామంలోకి బస్సులు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పాఠశాల, కళాశాల విద్యార్థులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో బుధవారం గ్రామస్తులు, విద్యార్థులు కలిసి జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. బస్సులు గ్రామం మీదుగా నడిపించి ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మనూర్ గ్రామంలోకి బస్సులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ధర్నాలో మన్నాన్ పటేల్, కాజా సాబ్, కార్తీక్ రెడ్డి, అంజన్నతో పాటు పలువురు గ్రామస్తులు, పాఠశాల, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి