Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బస్సులు గ్రామంలోకి రావాలి.. కళాశాల విద్యార్థులు ప్రజల డిమాండ్ బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 16, 2026 08:30 PM

318 పనులను గుర్తించి ప్రాధాన్యతతో చేపట్టాలి. జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ భాస్కర్‌రావు.

16-09-2026 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గ్రామాల అభివృద్ధికి వీజీపీపీ ప్రణాళికలు.

భువనగిరి, సెప్టెంబర్‌ 16 స్థానిక ప్రతినిధి:

గ్రామాల సమగ్ర అభివృద్ధికి వీఎస్‌జీపీ (వీజీపీపీ ) ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ భాస్కర్‌రావు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వీబీ -జి రామ్ జి పథకం కింద వీజీపీపీ అమలుపై ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, ఈసీలు, టీఏలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల అవసరాలను క్షేత్రస్థాయిలో గుర్తించి, ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టాలని కలెక్టర్‌ సూచించారు.వీజీపీపీ రూపకల్పన, గ్రామస్థాయి అవసరాల గుర్తింపు, అభివృద్ధి ప్రణాళిక తయారీ, వీబీ -జి రామ్ మార్గదర్శకాల అనుసంధానంపై అధికారులకు అవగాహన కల్పించారు. నాలుగు ప్రధాన విభాగాల్లో 318 పనులను గుర్తించారు. వాటర్‌ సెక్యూరిటీ కింద 107, కోర్‌ రూరల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ 88, రూరల్‌ లైవ్లీహుడ్‌ 86, డిజాస్టర్‌ మిటిగేషన్‌ కింద 37 పనులు ఉన్నట్లు వివరించారు. యాదగిరిగుట్ట మండలం మహబూబ్‌పేట గ్రామానికి సంబంధించిన రిసోర్స్‌, సోషల్‌ మ్యాప్‌ల ద్వారా గ్రామ అవసరాలను గుర్తించి ప్రణాళిక రూపొందించే విధానాన్ని వివరించారు.

శిక్షణలో మాస్టర్‌ ట్రైనీ బి.రాజశేఖర్‌ వీజీపీపీ అమలుకు సంబంధించిన సాంకేతిక అంశాలను వివరించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జేఏసీ చైర్మన్‌ మందడి ఉపేందర్‌రెడ్డి, డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్‌, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవోలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

318 పనులను గుర్తించి ప్రాధాన్యతతో చేపట్టాలి. జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ భాస్కర్‌రావు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News