కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వంట కార్మికుల ఒక్కరోజు దీక్ష...
మధ్యాహ్న భోజన వంట కార్మికులకు పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న 10వేల వేతనo వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న వంట కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన వంట కార్మికులు ఒక్కరోజు దీక్షను ఇమ్రాన్ పూలమాలలు వేసి ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ,ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రతిరోజూ మధ్యాహ్న భోజనం వండి పెడుతూ ఎంతో కీలకమైన సేవలు అందిస్తున్న వంట కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన తొమ్మిది నెలల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని,అలాగే ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నింటినీ సకాలంలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం ఏమాత్రం సరిపోవడం లేదని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వంట కార్మికులకు నెలకు రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామని చెప్పిన హామీని వెంటనే అమలు చేయాలని. సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని తీసుకురావడం వల్ల స్థానికంగా పనిచేస్తున్న వేలాది మంది వంట కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని,అందువల్ల సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేసి ప్రస్తుతం ఉన్న మధ్యాహ్న భోజన పద్ధతినే కొనసాగించాలని అన్నారు. అలాగే మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన కోడిగుడ్లు,గ్యాస్,నిత్యావసర వస్తువుల ఖర్చులను ప్రభుత్వమే పూర్తిగా భరించాలని, వంట కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వడంతో పాటు వారికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు.గతంలో పనిచేసిన కార్మికులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించి,ఎటువంటి రాజకీయ వేధింపులకు గురిచేయకుండా ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా ప్రభుత్వం మెస్ ఛార్జీలను పెంచి, పెరిగిన ఖర్చులకు అనుగుణంగా మధ్యాహ్న భోజన పథకానికి నిధులు కేటాయించాలని కోరారు.మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే రాబోయే రోజుల్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మరింత విస్తృతమైన ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు గనబోయిన వెంకటేష్,జిల్లా కోశాధికారి సామల శోభన్ బాబు,మధ్యాహ్న భోజన వంట కార్మికుల జిల్లా అధ్యక్షులు బాగుల వసంత,ప్రధాన కార్యదర్శి ముంతాజ్ బేగం,నాయకులు రాజమణి బచ్చమ్మ, శ్యామ్,పద్మ,రజిత,మంజుల,అరుణ,లీలా,అండాలు,సుమీల,వరమ్మ, వీరాస్వామి,మంజుల,హరిత,శ్యామల, రజిత తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి