మునగాల మండల పరిధిలోని నేలమర్రి గ్రామానికి చెందిన జడిగల మంగయ్య ఇటీవల మండల కేంద్రంలోజరిగినరోడ్డుప్రమాదంలోమరణించగా బుధవారం నేలమర్రి గ్రామంలో మంగయ్య నివాసంలో జరిగిన ఆయన దశదినకర్మ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ పార్టీ నాయకులతో కలిసి పాల్గొని మంగయ్య
చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, అనంతరం వారి కుటుంబ సభ్యుల్ని ఓదార్చి తీవ్ర సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు.అదేవిధంగా నేలమర్రి గ్రామానికి చెందిన గంగరబోయిన వెంకన్న ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి తన ఇంటి వద్ద వైద్యం చేయించుకుంటున్న వెంకన్నను మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ పార్టీ నాయకులతో కలిసి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తొగరు రమేష్, నేల మర్రి గ్రామ సర్పంచ్ రాంపగు సుందరయ్య, మాజీ జెడ్పిటిసి కోళ్ల ఉపేందర్, నర్రా వెంకటరెడ్డి, లచ్చిరెడ్డి, గడ్డం లింగయ్య,ఎల్పి రామయ్య, కాపర్తి మణికంఠ కుమార్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి