తెలుగు సాహిత్య చరిత్రలో ఒక అధ్యాయంగా నిలచిన "వెంటాడే కలాలు- వెనుకబడిన కులాలు" సంకలనానికి కోదాడ జన్మస్థలి కావడం గర్వకారణంగా ఉందని పుస్తక సంపాదకుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ అన్నారు. ఓనమాలు దిద్దించి నడక నేర్పిన నడిగూడెం, సామాజిక స్పృహనందించిన కోదాడ మట్టిస్ఫూర్తితోనే "వెంటాడే కలాలు" సంకలనం తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 20న జరిగే బీసీ కవుల అలాయ్ బలాయ్ "వెంటాడే కలాలు" పుస్తక రజతోత్సవ సందర్భంగా కోదాడలో బుధవారం నాడు రాయపూడి చిన్ని, బంగారు నాగమణి, వేముల వెంకటేశ్వర్లు, బాణాల వసంత, సిరికొండ శ్రీనివాస్, పుప్పాల కృష్ణమూర్తి, సరికొండ నరసింహారాజు తదితరుల నేతృత్వంలో రజతోత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జూలూరు మాట్లాడుతూ... 2001లో పల్లెలు చిద్రమై, కులవృత్తులు ధ్వంసమై, బడుగుల బతుకులు అల్లకల్లోలమైపోతున్న ప్రపంచీకరణ నేపథ్యంలో "వెంటాడే కలాలు" సంకలనం తీసుకురావడం జరిగిందన్నారు. ఇందులో 23 మంది బీసీ కవులు తమ ఆత్మకథనాత్మక వ్యధల్ని ఆవిష్కరించారని అన్నారు. చారిత్రాత్మకమైన రాష్ట్రస్థాయి దళిత సాహిత్య సదస్సుకి 1995లో కోదాడ పట్టణమే ఆతిథ్యమిచ్చి నిర్వహించిందని గుర్తు చేశారు. 1935 ల నుంచే నడిగూడెంకు గొప్ప సాహిత్య చరిత్ర ఉందన్నారు. రాజా నాయని వెంకట రంగారావు నడిగూడెం సంస్థానం నుంచే విజ్ఞాన చంద్రిక గ్రంథమండలి పేరున 60 పుస్తకాలు వెలువరించడం జరిగిందని సింహావలోకనం చేశారు. హైదరాబాదులో 20న జరిగే "వెంటాడే కలాలు రజతోత్సవ సభకు" రాష్ట్రం నలుమూలల నుంచి మూడు 300కు పైగా బీసీ కవులు హాజరవుతారని జూలూరు గౌరీశంకర్ తెలియజేశారు. ఈ సందర్భంగా పుస్తక సంపాదకులు కవి జూలూరు గౌరీశంకర్ ను త్రివేణి, వాగ్దేవి, రేస్ కళాశాలల చైర్మన్ బాణాల వసంత ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో... రామ నరసయ్య, హరి కిషన్, పొట్ట జగన్నాథం, షేక్ మీరా,డి.ఎన్. స్వామి, జి.ఎల్.ఎన్ రెడ్డి, జూలూరు వీరభద్రం, బాదేరాము,కొలిచలం శ్రీనివాస్, త్రివేణి డిగ్రీ, జూనియర్ కళాశాల విద్యార్థులు, కవులు, కళాకారులు పాల్గొన్నారు..
20న 'వెంటాడే కళలు.. వెనుకబడిన కులాలు' పుస్తకావిష్కరణ

Harish reporter

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి